బీజేపీ కార్యకర్తలను అక్కడ చంపేస్తున్నారా.. మూడు రోజుల్లో రెండో వ్యక్తి..!

పశ్చిమ బెంగాల్ లో మరో బీజేపీ కార్యకర్త చనిపోయాడు. వెస్ట్ బెంగాల్ లోని పురూలియా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కరెంట్ టవర్ కు అతడి ఉరివేసుకున్నట్లుగా తెలుస్తుంది. అతడు ఉరి వేసుకున్నాడా లేక ఎవరైనా చంపేసారా అన్నది తెలియాల్సి ఉంది. 32 సంవత్సరాల దులాల్ కుమార్ శుక్రవారం నాడు కనిపించకుండా పోయాడు. అయితే ఆ తర్వాత కొందరు వెతకగా దాబా గ్రామంలో ఇలా వేలాడుతూ కనిపించాడు.

దులాల్ చనిపోడానికి ముఖ్య కారణం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ ఆరోపించింది. వెస్ట్ బెంగాల్ పోలీసులు మాత్రం ఈ కేసును సీఐడీకి అప్పగించారు. అయితే మూడు రోజుల క్రితం కూడా వెస్ట్ బెంగాల్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 18 ఏళ్ల త్రిలోచన్ మహాంతో అనే బీజేపీ కార్యకర్త కూడా ఇలాగే బుధవారం నాడు చెట్టుకు వేళాడుతూ కనిపించాడు. ఇది పురులియా జిల్లాలో చోటుచేసుకుంది. అతడి దగ్గర ఓ సూసైడ్ నోట్ కూడా లభించడంతో కలకలం రేపింది. అందులో ‘బీజేపీ కి పనిచేసినందుకు విధించిన శిక్ష’ అని రాసుంది. ఇద్దరూ బీజేపీకి చెందిన కార్యకర్తలే కావడం.. అది కూడా ఒకే జిల్లాలో కావడంతో ఇప్పుడు బీజేపీ కార్యకర్తలకు భయం పట్టుకుంది. ఎవరో కక్షగట్టి ఈ పనులు చేస్తున్నారని భయపడుతున్నారు. మొన్న జరిగిన పంచాయతి ఎన్నికల్లో కూడా తీవ్రమైన హింస వెస్ట్ బెంగాల్ లో చోటుచేసుకుంది. అప్పుడు జరిగిన కొట్లాటలకు ప్రతీకార దాడులు ఇవి అయుండొచ్చు అని కొందరు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here