రేప్ చేశారంటూ పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్తే..ఎలా చేశారంటూ వేధించిన‌ పోలీసులు..బాధితురాలు ఆత్మ‌హ‌త్య‌

అత్యాచారానికి గురైన బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఇది. అత్యాచారం చేశారంటూ బాధితురాలు, ఆమె కుటుంబ స‌భ్యులు పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్ల‌గా.. అక్క‌డ వారికి చేదు అనుభ‌వం ఎదురైంది. పోలీసులు వారి ఫిర్యాదును స్వీక‌రించ‌లేదు. కేసు న‌మోదు చేయ‌లేదు.

 

పైగా- ఎలా చేశారో వివ‌రించాలంటూ నిల‌దీశారు. ఈ అవ‌మానాన్ని భ‌రించ‌లేక బాధిత బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని కోర్ధా జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని బాణాపూర్ బ్లాక్ ప‌రిధిలో ఉన్న సువాన్‌పాడా గ్రామానికి చెందిన బాధిత బాలిక గ‌త ఏడాది డిసెంబ‌ర్ 31వ తేదీన అత్యాచారానికి గుర‌య్యారు.

బాలిక బ‌హిర్భూమికి వెళ్ల‌గా.. అదే గ్రామానికి చెందిన నేమీ అనే యువ‌కుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై జ‌న‌వ‌రి 2వ తేదీన బాధిత బాలిక, ఆమె త‌ల్లిదండ్రులు బాణాపూర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

 

పోలీసులు కేసు న‌మోదు చేశారే త‌ప్ప దానిపై ద‌ర్యాప్తు ఆరంభించ‌లేదు. నిందితుడు త‌మ క‌ళ్ల‌ముందే నిర్భ‌యంగా తిరుగుతున్నాడ‌ని బాధిత బాలిక త‌ల్లిదండ్రులు పోలీసులకు మొర‌పెట్టుకున్న‌ప్ప‌టికీ వారు స్పందించ‌లేదు.

అత్యాచారం ఎలా చేశారో వివ‌రించాలంటూ వేధించ‌సాగారు. కేసు న‌మోదు చేసుకున్న మూడు వారాల త‌రువాత కూడా ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోక‌పోవ‌డంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధిత బాలిక పురుగుల మందు సేవించి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించారు.

ఆమెను కోర్ధా జిల్లా ఆసుప‌త్రికి త‌రలించగా అక్క‌డ చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌పై జిల్లాలో ఆందోళ‌న‌లు చెల‌రేగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here