శ్రీదేవి కూతుళ్లను ఏమన్నా అంటే ఊరుకోనన్న బోనీ పెద్ద కూతురు..!

శ్రీదేవి.. బోనీ కపూర్ ను పెళ్ళి చేసుకోకముందు ఆయనకు ముందే పెళ్ళి అయిందని.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని అందరికీ తెలిసిందే.. గతంలో వారికీ.. శ్రీదేవికి అసలు పొసగలేదని వార్తలు కూడా వచ్చేవి. కానీ శ్రీదేవి అంత్యక్రియల సమయంలో జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లపై బోనీ కపూర్ కొడుకు అర్జున్ కపూర్, పెద్ద కూతురు అన్షులా చూపించిన ప్రేమకు అవన్నీ అబద్దాలేనని తేలిపోయాయి. తాజాగా జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ పై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను అన్షులా ఖండించారు. జాన్వీ, ఖుషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నెటిజన్ పై ఆమె మండిపడ్డారు. శ్రీదేవి మరణానంతరం ఎంతో బాధలో ఉన్న జాన్వీ, ఖుషీలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ అన్షులా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ పై ఓ నెటిజన్ జాన్వీ, ఖుషీలను దూషిస్తూ, అసభ్యపదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ పోస్ట్ ను చూసిన అన్షులా తన చెల్లెళ్ల గురించి అలా మాట్లాడితే బాగుండదంటూ హెచ్చరించారు. ‘హాయ్, నా చెల్లెళ్లపై అసభ్య పదజాలాన్నిప్రయోగించవద్దని వేడుకుంటున్నా. నేను ఏమాత్రం మిమ్మల్ని సమర్థించడం లేదు.. మీ కామెంట్స్ ను తొలగించేస్తున్నాను. అదే సమయంలో, నా పై, నా సోదరుడు (అర్జున్ కపూర్) పై చూపించిన ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటాను…థ్యాంక్యూ ఫర్ ది లవ్’ అని అన్షులా మరో పోస్ట్ పెట్టింది. తన చెల్లెళ్ళను ఏదైనా కామెంట్ చేస్తే ఊరుకోనని చెబుతూ ఆ వ్యక్తి చేసిన మెసేజ్ ని డిలీట్ చేసేసింది. తమ మీద ప్రేమకు సంతోషమే కాని వాళ్ళను అంటే మాత్రం ఊరుకునేది లేదని ఈ ట్వీట్ ద్వారా ఆమె కొందరికి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here