ప్రభాస్ ను అన్నయ్య అనుకోవచ్చు కదా అని అనుష్కని అడిగితే ఏమందో తెలుసా..?

ప్రభాస్-అనుష్క పలుమార్లు వీరిద్దరి ప్రేమ, పెళ్ళి మీద వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ మాత్రం తాము ప్రేమించుకోవడం లేదు.. జస్ట్ స్నేహితులు మాత్రమే అని చెప్పుకుంటూ ఉన్నారు. తాజాగా భాగమతి సినిమా ఈవెంట్ లో భాగంగా చెన్నై వెళ్ళిన అనుష్క కు ఈ ప్రశ్నలే ఎదురయ్యాయి. తాము లవర్స్ కాదని జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది.

అయితే ప్రభాస్ ను తాను సోదరుడిలా కూడా భావించలేనని కూడా చెప్పడం విశేషం. “ప్రభాస్ ను నేను అన్నయ్యా అని పిలవలేను. అందరు అబ్బాయిలనూ సోదరులుగా భావించలేము కదా? నా గురించి ఎలాంటి వార్తలు వస్తున్నాయో తెలియదు. ఇక పెళ్లి గురించి ఆలోచించడమైతే మానేశాను. నా కోసం ఓ మంచి అబ్బాయిని వెతికితే చేసుకుంటా. ఏ విషయం గురించీ ఎక్కువగా ఆలోచించడం లేదు. సమయం వచ్చినప్పుడు వాటంతట అవే జరిగిపోతుంటాయి” అని వ్యాఖ్యానించింది.

ప్రభాస్ సాహో చిత్రం షూటింగ్ లొకేషన్ కు అనుష్క వెళ్ళడంపై పలు కథనాలు వెలువడ్డాయి. గతంలో చాలా సార్లు వీరి మధ్య ప్రేమ గురించి వార్తలు వచ్చినప్పుడు ఖండించారు. తాజాగా కూడా అదే చేశారు. చూద్దాం వీరు చెప్పింది ఎంత వరకూ నిజమో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here