ఈ ఫోటో చూసి.. అనుష్క-ప్రభాస్ పెళ్ళి ఫిక్స్ అనేస్తున్నారే..!

అనుష్క శెట్టి-ప్రభాస్ పెళ్ళి చేసుకోబోతున్నారని గతంలో పలుమార్లు వార్తలు వినిపించాయి. వీరిద్దరూ 2018లో ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటారని ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా అనుష్క శెట్టి ప్రభాస్ సాహో సినిమా సెట్స్ లో ప్రత్యక్షం అవ్వడం వారి మాటలకు బలం చేకూరుస్తున్నాయి.

సాహో షూటింగ్ చూడాలని అమ్మడు సెట్ లోకి వచ్చింది. చాలా సేపటివరకు అక్కడే ఉంది. ఇక షూటింగ్ అనంతరం దర్శకుడు సుజీత్ తో కలిసి ఒక సెల్ఫీ కూడా దిగింది. వారితో పాటు యాక్టర్ మురళీ శర్మ.. కెమెరామ్యాన్ మది కూడా ఉన్నారు. ఆ సెల్ఫీ పిక్ ప్రస్తుతం జనాలను చాలా ఆకట్టుకుంటోంది. సాహో సెట్స్ లో స్వీటీ అంతసేపు ఎందుకు ఉంది.. ప్రభాస్ కోసమేనని అంటూ ఉన్నారు. సాహో విడుదల తర్వాత వీరి పెళ్ళి జరుగుతుందని అంటూ ఉన్నారు. అదే జరిగితే అభిమానులు ఎంతగానో ఆనందపడతారు.

అయితే ప్రభాస్-అనుష్క మాత్రం తామిద్దరూ మంచి స్నేహితులేనని చెప్పుకుంటూ ఉన్నారు. మరో వైపు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు.. తాము మా వాడికి పిల్లను వెతుకుతున్నామని.. కానీ ఎవరూ సెట్ కాలేదని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here