తెర ముందు బాలయ్య‌..తెర‌వెనుక టీడీపీ కోట‌రీ ద‌ర్శ‌కుడు

హైద‌రాబాద్‌: నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా త‌ల‌పెట్టిన మూవీ `ఎన్టీఆర్‌`. మొద‌ట్లో ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టిన తేజ‌.. ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకొన్నారు. తాను అనుకున్న విధంగా సినిమా రావ‌ట్లేద‌ని, ఎన్నిక‌ల ప్ర‌యోజ‌నాల కోస‌మే ఈ బ‌యోపిక్‌ను తీయ‌డం త‌న వ‌ల్ల కాదంటూ ఆయ‌న త‌ప్పుకొన్నారు.

తేజ రూపంలో మొద‌ట్లోనే ఈ సినిమాకు ఎదురుదెబ్బ త‌గిలింది. ఇక‌- ఈ సినిమా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు తెలుగుదేశం కోట‌రీకే చెందిన కె రాఘ‌వేంద్ర‌రావు చేతుల్లోకి వెళ్తాయ‌ని భావించారు. దీనికోసం బాల‌కృష్ణతో పాటు నిర్మాత సాయి కొర్ర‌పాటి కూడా ఆయ‌న‌ను సంప్ర‌దించారు. దీనికి రాఘ‌వేంద్ర‌రావు అంగీక‌రించ‌లేదు. ఎస్వీబీసీ ఛాన‌ల్ ఛైర్మ‌న్‌గా నియ‌మితులు కావ‌డంతో.. సినిమాల‌కు దూరంగా ఉంటాన‌ని అన్నారు.

బాల‌కృష్ణ‌నే ద‌ర్శ‌క‌త్వం చేయాల‌ని సూచించారు. దీనితో పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ బాల‌కృష్ణ‌.. డైరెక్ట‌ర్ సీట్‌లో కూర్చోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. బాల‌కృష్ణ‌కు ద‌ర్శ‌క‌త్వం కొత్త‌. పైగా ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం కావ‌డంతో ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ను చూసుకోవ‌డానికి రాఘవేంద్ర‌రావు అంగీక‌రించారు. దీనితో సినిమా షూటింగ్ మ‌ళ్లీ ప‌ట్టాలెక్కిన‌ట్ట‌యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here