హోదా పోరు బ‌రిలో క‌త్తి మహేష్‌! హోదా కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉద్య‌మం న‌డిపినా మ‌ద్ద‌తు ఇస్తా!

న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశ రాజ‌ధానిలో చేప‌ట్టిన మ‌హా ధ‌ర్నాకు సినీ విమర్శ‌కుడు క‌త్తి మ‌హేష్ మ‌ద్ద‌తు ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ నాయ‌కుల‌తో క‌లిసి ఆయ‌న ఆ ధ‌ర్నాలో పాల్గొన్నారు. ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు.

 

రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాల్సిన‌, రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని క‌త్తి మ‌హేష్ నినదించారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న గ‌తంలోనూ చాలాసార్లు సోష‌ల్ మీడియా మాధ్య‌మంగా త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఈ సారి ప్ర‌త్య‌క్షంగా పోరు బాట‌లో దిగారు.

దీనివ‌ల్ల క‌త్తి మ‌హేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరార‌ని అభిప్రాయం ఏర్ప‌డిన‌ట్ట‌యింది. ఆయ‌న మాత్రం దాన్ని తోసిపుచ్చుతున్నారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఎవ‌రు, ఏ పార్టీ అయినా ఉద్య‌మాన్ని చేప‌డితే తాను అందులో పాల్గొంటాన‌నీ అంటున్నారు.

తాను ఎప్పుడూ విమ‌ర్శించే ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మానికి పిలుపిస్తే.. తాను ఆయ‌నకు మ‌ద్ద‌తు ఇస్తాన‌ని చెబుతున్నారు. ప్ర‌త్యేక హోదా కోసం రాజ‌కీయాల‌కు అతీతంగా ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఇలాంటి స‌మ‌యంలో రాజ‌కీయాల గురించో, తాను ఫ‌లానా పార్టీలో చేరాన‌ని విమ‌ర్శించ‌డమో స‌రికాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేస్తున్నారు.

జాయింట్ ఫ్యాక్ట ఫైండింగ్ క‌మిటీ కొత్త విషయాల్ని కనుక్కోకపోయినా, పాత విషయాలు నిజమే అని నిర్ధారించింది. ఢిల్లీలో జ‌రిగే అఖిలపక్షం ధర్నాకు పవన్ కళ్యాణ్ వస్తాడని, ప్రత్యేకహోదా సాధన దిశగా జనసేన పార్టీని సమాయత్తం చేస్తాడని తాను ఆశించాన‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here