8 నెల‌ల కింద‌ట అన్న‌..ఇప్పుడు చెల్లి: మంత్రి ప‌రిటాల సునీత కుమార్తె వివాహం

అనంత‌పురం: రాష్ట్ర మ‌హిళా, శిశు సంక్షేమ‌శాఖ మంత్రి పరిటాల సునీత కుమార్తె పరిటాల స్నేహలత, వ‌డ్ల‌మూడి శ్రీహర్ష వివాహం ఆదివారం వైభవంగా జరిగింది. సునీత స్వగ్రామం వెంకటాపురంలో జరిగిన వివాహ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. గ‌త ఏడాదే సునీత కుమారుడు ప‌రిటాల శ్రీ‌రామ్ వివాహం జ‌రిగింది.

మంత్రులు కాలవ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు, అమర్‌నాథ్‌రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, అయ్యన్నపాత్రుడు, నారాయణ, శిద్ధా రాఘవరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్‌ వీరపాండియన్‌, సినీ నటులు మంచు విష్ణు, రాజారవీంద్ర, నందమూరి రామకృష్ణ, ఎంపీ నిమ్మల, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, వివిధ పక్షాల నాయకులు, జిల్లా అధికారులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here