పెళ్ల‌యి అయిద నెల‌లే! కిరోసిన్ పోసి నిప్పంటించేశాడు!

చిత్తూరు: పెళ్ల‌యిన అయిదు నెల‌ల్లోనే అదన‌పు క‌ట్నం కోసం క‌ట్టుకున్న భార్య‌పై హ‌త్యాయత్నం చేశాడో దుర్మార్గుడు. అడిగినంత డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని, భార్య‌పై కిరోసిన్ పోసి నిప్పింటించేశాడు. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 80 శాతం కాలిన గాయాల‌తో ఆ మ‌హిళ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. చిత్తూరు జిల్లాలోని కుర‌బ‌ల కోట‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

బాధితురాలి పేరు ష‌మీనా. మ‌ద‌న‌ప‌ల్లి స‌మీపంలోని నందిరెడ్డిపల్లెకు చెందిన సయ్యద్‌బాషా తన కుమార్తె. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో అంగళ్లు గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్‌తో ఆమెకు పెళ్లి చేశారు. కొద్దిరోజుల‌కే ఆమెకు అద‌న‌పు క‌ట్నం వేధింపులు మొద‌ల‌య్యాయి. ఆమె భర్త ఇస్మాయిల్, అత్తామ‌మ త‌ర‌చూ హింసంచే వారు. వేధింపుల‌కు గురి చేస్తుండే వారు.

గురువారం కూడా వారి మ‌ధ్య గొడ‌వ‌లు చెల‌రేగాయి. రాత్రి 7 గంటల సమయంలో ఇస్మాయిల్ భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. దీంతో షమీనా తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని షమీనాను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్తతో పాటు అత్తామామలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here