తాగి.. డ్రైవింగ్ చేస్తూ దొరికిపోయాడు.. నేనెవరో తెలుసుకోవాలంటే గూగుల్ ని అడుగు..!

తాగి.. డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ఓ ఫుట్ బాల్ ప్లేయర్.. నేనెవరో తెలుసా.. నేను కోటీశ్వరుడిని.. ఫైన్ ఎంత కట్టాలో చెప్పు.. కట్టేస్తా.. నేనెవరో తెలియకపోతే గూగుల్ లో సర్చ్ చెయ్.. అంతేకానీ ఎక్కువ చేయొద్దు అంటూ పోలీసులను బెదిరించాడు ఫేమస్ ఫుట్ బాల్ ప్లేయర్. అతడు ఎవరో కాదు జేమ్స్ హర్స్ట్..!

 

వెస్ట్ బ్రోమ్ క్లబ్ కు చెందిన జేమ్స్ కు ఫుట్ బాల్ ఆటగాడిగా మంచి పేరు ఉంది. అయితే రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.. అప్పటికే బాగా తాగి ఉన్నాడట.. పోలీసు కానిస్టేబుల్ శామ్ స్మిత్ అతన్ని ప్రశ్నించగా.. ఏమి చేసుకుంటావో చేసుకో అన్నట్లు మాట్లాడాడు. దీంతో అతనిపై పోలీసులు కేసు బుక్ చేశారు. నార్త్ వేల్స్ లో అతడు కోర్టుకు హాజరు అయ్యాడు.

పోలీసులతో చాలా తప్పుగా ప్రవర్తించడంతో జేమ్స్ ను అభిమానులు కూడా తిడుతున్నారు. జేమ్స్ కు సంబంధించిన రిపోర్ట్ లను పోలీసులు బయటకు తీస్తుంటే.. నేను చాలా సెలెబ్రిటీని.. కావాలంటే మీరు వాటిని అమ్ముకోవచ్చు అని చెప్పాడు. మీరందరూ కలిసి నన్ను ఏమి చేయలేరు అని కూడా పోలీసులతో అన్నాడట. పోలీసులు అదుపులో తీసుకున్నప్పుడు తాగలేదని బుకాయించాడు.. కానీ అతడు చేసిన చేష్టలు.. బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ లో దొరికిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here