ముఖ్యమంత్రి అత్యాచారం చేశారన్న మహిళ.. ఆయనతో పాటూ మరో ఇద్దరు కూడానూ..!

సాధారణంగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిపై విపక్షాలు ఆరోపణలు చేయడం సర్వసాధారణం. అయితే ఏకంగా ఓ మహిళ ముందుకు వచ్చి తనపై ఆ ముఖ్యమంత్రి అత్యాచారం చేశాడని వాపోయింది. ఈ ఆరోపణలు చేసింది అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూపై..! 10 ఏళ్ల క్రితం పెమా ఖండూ, మరికొందరు కలసి తనపై గ్యాంగ్ రేప్ చేశారని ఆమె తెలిపింది. దీనిపై తాను ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు, జాతీయ మహిళా కమిషన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆమె తెలిపింది. దీంతో, తగిన ఆధారాలతో మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధపడింది.

2008 ఫిబ్రవరి 15లో పెమా ఖండూతో పాటు మరో ఇద్దరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారట. ఆ సమయంలో తాను స్పృహలో లేనని చెప్పింది. ఫిబ్రవరి 20న తాను చేసిన కంప్లయింట్ ను ఎన్.ఎస్.డబ్ల్యూ. పట్టించుకోలేదని తెలిపింది. ఘటన జరిగిన 7 ఏళ్ల తర్వాత (2015లో… ఖండూ సీఎం పదవిని చేపట్టడానికి కొన్ని నెలల ముందు) ఆమె ఈటానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు అదంతా ఉత్తిదేనని తేల్చారు.

దీనిని పెమా ఖండూ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలు ఆడుతున్న చెత్త నాటకం అని అన్నారు. ఆమెను ఎవరో రాజకీయనాయకులే రెచ్చగొట్టి తన మీదకు వదిలారని ఆయన అన్నారు. ఇంత దిగజారుడు పనులను చేస్తూ ఉంటే అసహ్యం వేస్తోందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here