రేపిస్ట్ ఆశారాంకు జీవిత ఖైదు..!

అనుకున్నట్లుగానే ఆశారాం బాపుకు జీవిత ఖైదు విధించారు. ఈరోజు ఉదయం మైనర్ యువతిని రేప్ చేసిన కేసులో ఆశారాం ను దోషిగా ప్రకటించింది జోధ్‌పూర్ కోర్టు… ఆశారాంను జైలుకు తరలించిన తర్వాత అతడికి విధించబోయే శిక్షను తెలియజేస్తామని కోర్టు తెలిపింది. అనుకున్నట్లుగానే రేపిస్ట్ ఆశారాంకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు తీర్పును ఇచ్చింది.

2013లో యూపీకి చెందిన షాజహాన్‌పూర్ గ్రామస్తురాలైన మైనర్ యువతి చికిత్స కోసం ఆశ్రమానికి వెళ్లింది. ఆ సమయంలో ఆశారాం ఆమెను లోబరుచుకున్నారు. విషయాన్ని దాచడానికి ఆమె కుటుంబం మీద అప్పట్లో తీవ్ర ఒత్తిడి తీసుకొని వచ్చారు. కానీ కోర్టును ఆశ్రయించడంతో 2013 ఆగస్టు 31న అతన్ని అరెస్టు చేశారు. ఇప్పటికే 56 నెలల నుంచి ఆశారాం జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. ఇదే కేసులో దోషులుగా తేలిన శరద్, శిల్పిలకు చెరో 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. దాదాపు అయిదేళ్ళ తర్వాత ఆశారాం ను దోషిగా తెలుస్తూ జోద్ పూర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ట్రైబ్ కోర్టు తీర్పును ఇచ్చింది. 2013లో అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, ఆయన్ను జైలుకు తరలించగా, అప్పటి నుంచి ఆశారాం జైల్లోనే ఉన్నాడన్న సంగతి తెలిసిందే. పలుమార్లు ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. అన్ని సాక్ష్యాలు ఆశారాంకు వ్యతిరేకంగా ఉండడంతో దోషిగా తేల్చింది కోర్టు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here