ఆ విమానంలో ఉన్న 66 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి..!

ఇరాన్ కు చెందిన ప్యాసెంజర్ విమానం కూలిన ఘటనలో ఏకంగా 66 మంది చనిపోయారు. టెహ్రాన్ నుంచి యాసౌజికి వెళుతున్న విమానం పడేనా పర్వత ప్రాంతంలో కుప్పకూలినట్టు తెలుస్తోంది. కూలిపోవడానికి ముందు ఈ విమానం పొలాల్లో ల్యాండయ్యేందుకు ప్రయత్నించినట్టు కొందరు ప్రత్యక్ష సాక్షుల కథనంగా స్థానిక మీడియా పేర్కొంది. విమానం కూలిపోయినట్టు ఇరాన్ బోయర్ పట్టణ గవర్నర్ అహ్మద్ ధ్రువీకరించారు.

సెమిరోమ్ పట్టణం వద్ద ఉన్న కొండల ప్రాంతంలో విమానం కూలిపోయింది. విమాన ప్రమాదం జరిగిన సమయంలో మబ్బులు కాస్త ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ అసెమన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం 60 మంది ప్యాసెంజర్లు.. ఆరు మంది సిబ్బందితో బయలుదేరింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికి సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే విమానం కూలినట్లు సమాచారం అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here