కెప్టెన్ అయిన అశ్విన్.. రిటైర్ అవ్వనున్న మోర్నీ మోర్కెల్..!

రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ అయ్యాడు.. ఇంతకూ ఏ జట్టుకు అనేగా మీ డౌట్..! ఐపీఎల్ లో పాల్గొనబోయే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు. ఐపీఎల్‌ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకి కెప్టెన్‌గా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌‌ని నియమిస్తూ ఆ జట్టు ఫ్రాంఛైజీ సోమవారం నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలం చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన అశ్విన్‌ను ఆ ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకోకపోవడంతో పాటు.. వేలంలోనూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చకపోవడంతో అతడ్ని పంజాబ్ వేలంలో రూ. 7.6కోట్లకు దక్కించుకుంది. అశ్విన్‌ని కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు పంజాబ్ మెంటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా వెల్లడించాడు. పంజాబ్ మేనేజ్‌మెంట్‌ చర్చల్లో కెప్టెన్‌గా యువరాజ్ సింగ్ పేరు కూడా వచ్చిందని సెహ్వాగ్ చెప్పాడు.

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్‌ ప్రకటించాడు. మార్చి 1 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్‌ తనకి చివరిదంటూ సోమవారం వెల్లడించాడు. దక్షిణాఫ్రికా తరఫున 83 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20 మ్యాచ్‌లలో మోర్కెల్ ఆడాడు. 2006లో భారత్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here