షోయబ్ కోసం యాడ్ లో మెరిసిన సానియా..!

సానియా మీర్జా.. పరిచయం అక్కరలేని స్పోర్ట్స్ పర్సనాలిటీ.. ఎంతో మందికి రోల్ మోడల్..! భారత టెన్నిస్ రంగంలో ఆమెకంటూ ప్రత్యేక స్థానమే ఉంది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను సానియా మీర్జా పెళ్ళి చేసుకుంది. పాకిస్థాన్ లో కూడా సానియా మీర్జా ఇమేజ్ మామూలుగా లేదు. ఆమెతో పలు కంపెనీలు ప్రకటనలు చేయడానికి ముందుకు వస్తున్నాయి. తాజాగా భార్యాభర్తలు కలిసి ఓ అడ్వర్టైజ్మెంట్ లో కలిసి నటించారు.

ఈ యాడ్ లో సానియా టెన్నిస్ రాకెట్ బదులు.. గరిటె పట్టుకుంది. ‘ఏషియా ఘీ’ యాడ్ లో ఇద్దరూ కలిసి నటించారు. షోయబ్ కొందరు పిల్లలతో క్రికెట్ ఆడుకుంటూ బంతిని పోగొడుతాడు. దీంతో వారందరికీ ఇంటిలో భోజనం వడ్డించాల్సి ఉంటుంది. వెంటనే ఇంటికి వెళ్ళిన షోయబ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ క్రికెటర్లు మన ఇంటికి రాబోతున్నారు.. వెంటనే మంచి మంచి వంటలు తయారు చేయమని సానియాకు చెబుతాడు. సానియా ఏషియా నెయ్యి ని ఉపయోగించి ఘుమఘుమలాడే వంటలను తయారుచేసి పెడుతుంది. వంటలు సిద్ధమవగానే పిల్లలు లోపలికి వస్తారు. పీఎస్ఎల్ క్రికెటర్లు అన్నావ్.. ఈ పిల్లలంతా ఎవరు అన్న డౌట్ తో సానియా చూడగా.. ఆ పిల్లలు ‘ఇక్కడి వరకూ ఎలాగూ వచ్చేశాం.. పీఎస్ఎల్ లో కూడా ఆడేస్తాం అని సమాధానం ఇస్తారు. ఈ జంట కనిపించిన ఈ యాడ్ ఇప్పుడు బాగా ఆకట్టుకుంటోంది. షోయబ్ మాలిక్ పీఎస్ఎల్ లో ముల్తాన్ సుల్తాన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here