జుబ్బా వేసుకొని పాడె మోస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా..?

సాధారణంగా మన ఎమ్మెల్యేలు.. వాళ్ళ అనుచరులు ప్రదర్శించే డాబు మామూలుగా ఉండదు. ఎవరో కొంతమంది మాత్రమే సాధారణమైన జీవితం గడుపుతూ ఉంటారు. ఇక్కడ పాడె మోస్తున్న వ్యక్తి కూడా అలాంటి కోవకు చెందిన ఆయనే..! ఈయన ఓ ఎమ్మెల్యే అస్సాంకాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మి..! ఓ పేదవాడు చనిపోతే అతడి పాడె మోసి.. అంత్యక్రియలు కూడా జరిపించి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.

గౌహతికి 320కిలోమీటర్ల దూరంలో ఉన్న మరియాని పట్టణంలో శుక్రవారం దిలీప్ డే అనే వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ రాలేదు.. కనీసం శవాన్ని మోసుకెళ్లేందుకు ఆ నలుగురు కూడా లేరు. దిలీప్ మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే కుర్మి అక్కడికి వచ్చారు.

చనిపోయిన దిలీప్ చాలా పేదవాడని, కనీసం అంత్యక్రియలకు కూడా అతని వద్ద ఎవరూ లేరని, ఈ స్థానం నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను.. కాబట్టి ఆ పేదోడికి ఈ రకంగానైనా సాయం చేయాలని భావించినట్లు ఎమ్మెల్యే కుర్మి తెలిపారు. బొంగు కర్రలతో చేసిన పాడెను ఎమ్మెల్యే మోశారు. అదే రోజున ఓ ఆటోడ్రైవర్ తల్లి చనిపోతే.. ఆమె అంత్యక్రియల్లోనూ ఆయన పాల్గొన్నారట. మరియాని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కుర్మి మూడుసార్లు నెగ్గారు. ఇంత మంచి ఎమ్మెల్యేలు మన దగ్గర ఒక్కరు కూడా కనిపించరు ఎందుకో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here