ఆయిల్ బావిలో అగ్ని ప్రమాదం..!

ఆయిల్ బావి వద్ద జరిగిన అగ్ని ప్రమాదం 10 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. అంతేకాకుండా డజన్ కు పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. అక్రమంగా త్రవ్విన ఆయిల్ బావి వాదా పనులు చేస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం నాడు ఇండోనేషియా లోని అకే ప్రావిన్స్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

అర్ధరాత్రి 1:30 సమయంలో ఆయిల్ బావికి మంటలు అంటుకున్నాయి. ఆ బావి పక్కనే ఉన్న మూడు ఇళ్ళకు కూడా మంటలు వ్యాపించాయి. ఉదయం వరకూ కూడా మంటలను అదుపులోకి తీసుకురాలేకపోయారు. ఇప్పటికి 10 డెడ్ బాడీలను పోలీసులు బయటకు తీసుకొని వచ్చారు. ఇంకా చాలా మంది చనిపోయి ఉండే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. కొందరు పర్మిషన్లు లేకుండా ఆయిల్ బావులను త్రవ్వుతూ ఉంటారు.. ముఖ్యంగా గ్రామస్థులు బయటకు తెలీకుండా ఇల్లీగల్ గా బిజినెస్ చేస్తూ ఉంటారు. అలా త్రవ్విన బావే ఇదని పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఇలా అక్రమంగా త్రవ్విన బావుల వలన ఎందఱో ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here