కారులో వెళుతున్న వాళ్ళు కొందరైతే.. కింద పనిచేస్తున్న వాళ్ళు మరికొందరు.. ఇంతలో..!

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని వారణాశిలో కన్నాట్ రైల్వే స్టేషన్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కూలిపోయింది. ఫై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ఫ్లై ఓవర్ కింద ఉన్న కార్లు కూడా నుజ్జునుజ్జు అయ్యాయి. మరికొందరు శిధిలిలా కింద చిక్కుకున్నారు. కొంత మంది తీవ్రగాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. సహాయక చ్యలు ప్రారంభించేందుకు రంగంలోకి దిగారు పోలీసులు.

 

ఫ్లైఓవర్ కూలిపోవడం వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ ఘటన జరగడం అత్యంత దారుణమని వారు అన్నారు. ప్రాణాలు విడిచిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here