అంతిమ‌యాత్ర‌పై కురిసిన బాంబుల వ‌ర్షం

బాగ్దాద్‌: అంత్య‌రుద్ధంతో ఇప్ప‌టికే క‌కావిక‌లమైన ఇరాక్ మ‌రోసారి ర‌క్త‌మోడింది. బాంబు పేలుళ్ల‌తో ద‌ద్ద‌రిల్లింది. మిలిటెంట్ల దాడుల్లో మ‌ర‌ణించిన ఇరాకీ సైనికుల అంతిమ‌యాత్ర‌పై బాంబుల వ‌ర్షం కురిపించారు ఉగ్ర‌వాదులు. ఈ ఘ‌ట‌న‌లో 25 మంది మ‌ర‌ణించారు.

18 మంది గాయ‌ప‌డ్డారు. వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. మృతుల సంఖ్య మ‌రింత పెర‌గొచ్చ‌ని అంటున్నారు. ఇరాక్ ద‌క్షిణ ప్రాంతంలోని ష‌ర్క‌త్ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సున్నీ ముస్లింలు ఎక్కువ‌గా నివ‌సించే ప్రాంతం ఇది.

ఇటీవ‌లే జ‌రిగిన దాడుల్లో మ‌ర‌ణించిన ఇరాకీ సైనికుల భౌతిక కాయాల‌ను శ్మ‌శానానికి తీసుకెళ్లిన త‌రువాత బాంబు దాడులు చోటు చేసుకున్నాయి. ఈ దాడులు ఎవ‌రు చేశార‌నేది ఇంత వ‌ర‌కూ ఖ‌చ్చితంగా తెలియ‌రాలేదు. ఇది ఐసిస్ ఉగ్ర‌వాదుల ప‌నేన‌ని చెబుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here