డొనాల్డ్ ట్రంప్ రాసిన ఓ లెట‌ర్‌.. ఇంగ్లీష్ లెక్చ‌ర‌ర్‌ చేతిలో ప‌డింది! దాన్నిండా..!

పాఠ‌శాల్లో భ‌ద్ర‌త‌, గ‌న్ క‌ల్చ‌ర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిరోజుల కింద‌టే ఓ లేఖ రాశారు. దాదాపు అమెరికాలోని అన్ని పాఠ‌శాల‌లు, విద్యాసంస్థ‌ల‌కు ఆ లేఖను ఇ మెయిల్ చేశారు వైట్‌హౌస్ ప్ర‌తినిధులు. యువొన్నె మేస‌న్ పేరు మీద అట్లాంటాలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ‌లో ఇంగ్లీష్ లెక్చ‌ర‌ర్‌కు కూడా ఆ లెట‌ర్‌ను పంపించారు. ఇంగ్లీష్ లెక్చ‌ర‌ర్ క‌దా! త‌మ దేశాధ్య‌క్షుడికి ఉన్న ఆంగ్ల భాషా ప‌రిజ్ఞానం ఏ స్థాయిలో ఉందోన‌ని ప‌రీక్షించారు.

ఆ త‌రువాత ఆమెకు స్పృహ త‌ప్పినంత ప‌నైంది. ఆ లేఖ నిండా త‌ప్పులు, అక్ష‌ర దోషాలు ఉన్నాయ‌ట‌. వాట‌న్నింటినీ బాల్ పాయింట్ పెన్‌తో క‌రెక్ష‌న్ చేశారు. క‌రెక్ష‌న్ చేసిన లెట‌ర్‌ను ఆమె త‌న ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అది కాస్తా వైర‌లై కూర్చుంది. ప్ర‌తి సెన్టెన్స్‌లోనూ త‌ప్పులు వెదికారామె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here