ఇంతకంటే అవమానం ఉంటుందా.. మ్యాచ్ జరుగుతుంటే కెప్టెన్సీ నుండి పీకేశారు..!

ఆస్ట్రేలియా జట్టు బాల్ టాంపరింగ్ కు పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని కూడా దీన్ని తీవ్రంగా పరిగణించారు. అలాంటి చర్యలకు పాల్పడి దేశం ప్రతిష్టను నాశనం చేస్తున్నారని చెప్పారు. ఇక మూడో టెస్టు నాలుగో రోజున ఆస్ట్రేలియా క్రికెట్ యాజమాన్యం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆసీస్ కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ ను పీకేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఓ మ్యాచ్ అయిపోయిన తర్వాత అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుండి తీసివేస్తారని అనుకున్నారు. కానీ ఏకంగా మ్యాచ్ మధ్యలోనే కెప్టెన్సీ నుండి తీసిపడేశారు. ఇక వైస్ కెప్టెన్ అయిన వార్నర్ ను కూడా అతడి బాధ్యతల నుండి తొలగించివేశారు. ప్రస్తుతం టిమ్ పైన్ ను ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ గా నియమించారు. “ఈ టెస్ట్ మ్యాచ్ కొనసాగాలి. అత్యవసరమనుకుంటే ఈ వ్యవహారాన్ని మ్యాచ్ ముగిసేలోగానే మేము విచారిస్తాం” అని సీఏ సీఈఓ జేమ్స్ సదర్లాండ్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ బాల్ టాంపరింగ్ వ్యవహారాన్ని ప్రతి ఒక్కరూ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్మిత్, బాన్‌క్రాఫ్ట్, కోచ్ లీమన్ లకు పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య సౌతాఫ్రికా బలమైన స్థితిలో ఉన్న సమయంలో ఆస్ట్రేలియా ఇలా బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడడింది. ప్రస్తుతం ఈ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు నాలుగో రోజు లంచ్ ముగిసే సమయానికి 389పరుగులు వెనుకబడి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here