మిస్ట‌రీ ఛేదించారా? జాడ తెలియ‌కుండా పోయిన మ‌లేసియా విమాన శ‌క‌లాలు క‌నిపించాయా?

మెల్‌బోర్న్‌: విమాన ప్ర‌మాదాల్లో అదో మిస్ట‌రీ. వంద‌ల కోట్ల రూపాయ‌లు ధార‌పోసి, అత్యాధునిక సాంకేతిక ప‌రిక‌రాల‌ను వినియోగించి, రోజుల త‌ర‌బ‌డి అనంత సాగ‌రాల్లో అన్వేషించినా ఆ విమానం జాడ ఇప్ప‌టికీ దొర‌క‌లేదు. ఎప్ప‌టికీ దొర‌క‌దేమో అనే అనుకున్నారు. అదే మ‌లేసియా ఎమ్‌హెచ్ 370 విమాన ప్ర‌మాదం.

మ‌లేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి 2014 మార్చి 8న చైనా రాజ‌ధాని బీజింగ్‌కు 239 మంది ప్ర‌యాణికులు, సిబ్బందితో ఎగిరిన ఆ విమానం.. కొన్ని గంట‌ల్లోనే అదృశ్య‌మైంది. ఎటు వెళ్లిందో, ఎక్క‌డ కూలిందో తెలియ‌దు. భార‌త్ స‌హా ఎనిమిది దేశాలు ఆ విమానం కోసం అన్వేషించాయి.

అత్యాధునిక సాంకేతిక ప‌రిక‌రాల‌ను వినియోగించే, స‌ముద్ర గ‌ర్భంలో గాలించాయి. చిన్న‌, చిన్న ద్వీపాల‌నూ వ‌ద‌ల్లేదు. అయిన‌ప్ప‌టికీ.. దాని జాడ క‌నిపించ‌లేదు. ఇక లాభం లేద‌నుకుని ఆ విమానంలో ప్ర‌యాణికులంద‌రూ మ‌ర‌ణించిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. అన్వేష‌ణ‌ను మానుకున్నారు. తాజాగా ఈ ప్ర‌మాద ఉదంతం మ‌రోమారు వార్త‌ల్లోకెక్కింది.

అమెచ్యుర్ క్రాష్ ఇన్వెస్టిగేట‌ర్ ఒక‌రు గూగుల్ ఎర్త్ ద్వారా ఆ విమానం శ‌క‌లాల‌ జాడ‌ల‌ను క‌నుగొన్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఆయ‌న పేరు పీట‌ర్ మెక్‌మోహ‌న్‌. ఆ వ్య‌క్తి ఆస్ట్రేలియాకు చెందిన మెకానిక‌ల్ ఇంజినీర్‌. క్రాష్ ఇన్వెస్టిగేట‌ర్‌గా పాతికేళ్ల అనుభవం ఉంది.

 

గూగుల్ మ్యాప్స్‌, నాసా ఫొటోల ద్వారా తాను ఈ విమాన శ‌క‌లాల జాడ‌ల‌ను క‌నుగొన్నాన‌ని అంటున్నారు. తాను క‌నుగొన్న విమాన శ‌క‌లాల ఫొటోల‌ను ఆస్ట్రేలియ‌న్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యురోకు పంపించాన‌ని, వాటిని ఇంకా ధృవీక‌రించాల్సి ఉందనీ ఆయ‌న చెబుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here