ఇక ఈ జీవి కూడా ఎంతో కాలం బ‌త‌క‌లేద‌ట‌! అది గాలి ఎక్క‌డ్నుంచి పీలుస్తుందో తెలిస్తే..షాక్‌!

మెల్‌బోర్న్‌: నెత్తి మీద, వీపుపై ఏపుగా పెరిగిన నాచు, మ‌నిషి చేతి వేళ్లంత పొడ‌వున పెరిగిన గోళ్లు, ముదురు చ‌ర్మం.. చూడ్డానికి విచిత్రంగా క‌నిపిస్తోన్న ఈ జంతువు మ‌న‌కు చిర‌ప‌రిచిత‌మే. అది తాబేలు. సాధార‌ణ తాబేలు కంటే భిన్న‌మైన‌ది. దాని భిన్న‌త్వం ఏమిటో చూస్తేనే తెలిసిపోతోంది.

ఆస్ట్రేలియాలో మాత్ర‌మే క‌నిపించే ఈ తాబేలు పేరు మేరీ రివ‌ర్ ట‌ర్ట‌ల్ ఆలియాస్ `పంక్ ట‌ర్ట‌ల్‌`. మ‌ర్మాంగం ద్వారా గాలి పీల్చుకోవ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. ఈ భూమండ‌లంపై అలాంటి ప్ర‌త్యేక‌త ఉన్న ఏకైక ప్రాణి ఇది. త్వ‌ర‌లోనే అంత‌రించ‌బోతోంది. అతి వేగంగా అంత‌రించి పోయే ప్రాణుల జాబితాలో ఈ మేరీ రివ‌ర్ ట‌ర్ట‌ల్‌ను చేర్చారు ప‌రిశోధ‌కులు.

ఈ ర‌కం జాతి తాబేళ్లు ఎంతో కాలం ఈ భూమ్మీద మ‌నుగ‌డ సాగించ‌లేవ‌ని జులాజిక‌ల్ సొసైటీ ఆఫ్ లండ‌న్‌ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా ఈస్ట్‌కోస్ట్‌లోని మారుమూల ప్రాంతంలో మాత్ర‌మే జీవించే ఈ జీవిని ద‌క్కించుకోవ‌డానికి త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వారు స్ప‌ష్టం చేశారు.

50 మిలియ‌న్ల సంవ‌త్స‌రాల కింద‌ట ఇలాంటి జీవులు ఉండేవ‌ని ఆస్ట్రేలియాలోని ఛార్లెస్ డార్విన్ యూనివ‌ర్శిటీ ప‌రిశోధ‌కుడు మెరిలిన్ కొన్నెల్ తెలిపారు. రాక్ష‌స బ‌ల్లుల త‌ర‌హాలో ఈ జీవి కూడా అంత‌రించి పోతే.. దానికి మాన‌వ వైఫ‌ల్య‌మే ప్ర‌ధాన కార‌ణ‌మౌతుంద‌ని ఆయ‌న అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here