`స‌మ‌ర‌సింహారెడ్డి`త‌ర‌హాలో ఎటాక్‌: గ‌తంలో రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్‌..ఇప్పుడు ఆటోడ్రైవ‌ర్‌! వ‌ద‌ల‌ని ప్రత్య‌ర్థులు

భువనేశ్వ‌ర్‌: ఒడిశాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌ట్ట‌ప‌గ‌లు ఆటోస్టాండ్‌లో నిల్చున్న ఓ ఆటో డ్రైవ‌ర్‌పై బాంబు దాడి జ‌రిగింది. బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆటోడ్రైవ‌ర్‌పై బాంబు విసిరి పారిపోయారు.

ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన ఆటోడ్రైవ‌ర్‌.. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. ఒడిశాలోని న‌యాగ‌ఢ్ జిల్లాలో సోమ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతుడిని బ‌లుగావ్‌కు చెందిన ఝులు బ‌రిక్‌గా గుర్తించారు.

కొన్నేళ్లుగా అత‌ను రాజ్‌సున‌ఖ‌ల ప‌ట్ట‌ణంలో నివాసం ఉంటున్నాడు. ఆటో డ్రైవ‌ర్‌గా జీవ‌నం సాగిస్తున్నాడు. ఈ ఉద‌యం 9:30 గంట‌ల స‌మంయ‌లో అత‌ను ఇంట్లో నుంచి ఆటోతో స‌హా బ‌య‌టికి వ‌చ్చాడు.

ఆటో స్టాండ్ ప‌క్క‌నే ఉన్న ఓ షాపు ముందు నిల్చుని ఉండ‌గా.. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడి చేశారు. మొద‌ట అత‌నిపై తుపాకుల‌తో కాల్పులు జ‌రిపారు. అనంత‌రం బాంబు విసిరి పారిపోయారు.

గ‌తంలో ఝులు బ‌రిక్ రియ‌ల్ ఎస్టేట్ కార్య‌క‌లాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడ‌ని, పాత‌క‌క్ష‌ల‌తోనే ఈ హ‌త్య జ‌రిగి ఉంటుంద‌ని పోలీసులు ధృవీక‌రించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. దీనికోసం సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here