కుమారుడి దారుణ‌హ‌త్య‌..కుప్ప‌కూలిన త‌ల్లి!

బెంగ‌ళూరు: బెంగ‌ళూరులో దారుణ‌ఘ‌ట‌న. ఓ యువ‌కుడిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దారుణంగా హ‌త‌మార్చారు. బెంగ‌ళూరు జేసీ న‌గ‌ర స‌మీపంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

హ‌తుడి పేరు సంతోష్‌. జేసీ న‌గ‌ర‌లో నివ‌సించే సంతోష్ బీజేపీలో క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌. దీనితో ఈ హ‌త్యోదంతం రాజ‌కీయ రంగు పులుముకుంటోంది. సంతోష్ ఆటోడ్రైవ‌ర్‌.

బుధ‌వారం సాయంత్రం 7:30 గంట‌ల స‌మ‌యంలో నందిహిల్స్ రోడ్‌లో ఉన్న ఓ బేక‌రీ వ‌ద్ద టీ తాగ‌డానికి రాగా.. న‌లుగురు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు క‌త్తుల‌తో సంతోష్‌పై దాడి చేశారు. పొడిచి చంపారు.

అదే ప్రాంతానికి చెందిన వసీం, ఉమ‌ర్‌, ఫిలిప్స్ ఇర్ఫాన్‌లుగా గుర్తించారు. గంజాయి అక్ర‌మ ర‌వాణా వ్య‌వ‌హారాన్ని సంతోష్ అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డ‌మే ఈ హ‌త్య‌కు దారి తీసి ఉంటుంద‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

న‌లుగురు హంత‌కుల‌కు గంజాయి అక్ర‌మ ర‌వాణాతో సంబంధాలు ఉన్నాయ‌ని, సంతోష్‌ను హ‌త్య చేసే స‌మ‌యంలోనూ వారు గంజాయి మ‌త్తులో ఉన్న‌ట్టు అనుమానిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌లో వ‌సీం, ఫిలిప్స్‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఉమ‌ర్‌, ఇర్ఫాన్ ప‌రారీలో ఉన్నారు. త‌న కుమారుడి హ‌త్య‌వార్త విన్న వింట‌నే త‌ల్లి కుప్ప‌కూలిపోయారు. స్పృహ త‌ప్పారు.

వెంట‌నే ఆమెకు ప్రాథ‌మిక చికిత్స అందించారు. ఆమెను స‌ముదాయించ‌డానికి ఎవ‌రి త‌ర‌మూ కాలేదు. ఆటోడ్రైవ‌ర్‌గా కుటుంబానికి అండ‌గా ఉన్నాడంటూ విల‌పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here