సూసైడ్ నోట్ బయటకు వస్తేనే కానీ తెలీలేదు ఆమె భర్త ఎలాంటి వాడో..!

ఈ ఫోటోలో చూస్తున్న వివాహిత పేరు అవంతిక.. ఈమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెద్దలను ఎదిరించి తాను మేజర్ ను ఎవరూ అడ్డు రాకండి అని చెప్పి మరీ పెళ్ళి చేసుకుంది. బంధువుల ఇంటికి వచ్చిన అవంతిక ఓ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. ఎంత సమయం అయినా బయటకు రాకపోవడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్ళి చూడగా ఆమె అప్పటికే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త హరదీప్ సింగ్ ఆమెను బంధువుల ఇంటిలో వదిలిపెట్టి వెళ్ళాడు. అతడు వదిలిపెట్టి వెళ్ళగానే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది.

ఆమె చనిపోడానికి ముందు రాసిన సూసైడ్ నోట్ లో ఆమె పడ్డ కష్టాలు.. భర్త ఎలాంటి వాడో బయటకు వచ్చాయి..! అవంతిక తన సూసైడ్ నోట్ లో తన తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా ఆ యువకుడిని పెళ్ళి చేసుకున్నాను.. మొదట్లో అత్తారింటికి తీసుకెళ్ళినప్పుడు అంతా బాగానే చూసుకున్నారు. కానీ కొద్ది రోజులకు కొట్టడం మొదలుపెట్టాడు. అత్తా మామలు కూడా తనను హింసించడం మొదలుపెట్టారు. ఎవరికి చెప్పాలో తనకు తెలీలేదు.. అందుకే వీరందరికీ దూరంగా వెళుతున్నా అని రాసి ఆత్మహత్య చేసుకుంది. దీంతో తల్లిదండ్రులు అవంతిక భర్త, వారి కుటుంబంపై కేసు నమోదు చేశారు.

mohali girl hanged herself in parents house

అవంతిక కొన్ని రోజుల క్రితమే పెళ్ళి చేసుకుంది. అప్పటికి అవంతికకు 18 సంవత్సరాలు మాత్రమే.. పోలీసుల ముందే తాను మేజర్ ను అతన్ని పెళ్ళి చేసుకోవడం ఇష్టమే అని తల్లిదండ్రులకు ఎదురు చెప్పి మళ్ళీ పెళ్ళి చేసుకుంది. కానీ కొనీ నెలలకే ఇలా ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడంతో తాను ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె సూసైడ్ నోట్ లో రాసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here