వైల్డ్‌లైఫ్‌పై అవార్డు విన్నింగ్ మూవీల‌ను తీసిన ద‌ర్శ‌కుడు..జిరాఫీ బారిన ప‌డి

క‌త్తి ప‌ట్టుకున్న వాడు ఆ క‌త్తికే బ‌ల‌వుతాడ‌నేది టాలీవుడ్ క‌నిపెట్టిన సామెత‌. ఇదీ అలాంటిదే. భుజాన కెమెరా వేసుకుని రోజుల త‌ర‌బ‌డి అడ‌వులు, జాతీయ పార్కుల్లో తిరుగుతూ వైల్డ్‌లైఫ్‌ను చిత్రీక‌రించే ఓ మూవీ ద‌ర్శ‌కుడు.. చివ‌రికి అదే వైల్డ్‌లైఫ్ బారిన ప‌డి మ‌ర‌ణించాడు. ఓ జిరాఫీ ఆ ద‌ర్శ‌కుడిని చంపేసింది. ద‌క్షిణాఫ్రికా అడ‌వుల్లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఆ ద‌ర్శ‌కుడి పేరు కార్లోస్ కార్వ‌ల్హో. `వైల్డ్ అట్ హార్ట్` అనే పాపుల‌ర్ టీవీ సిరీస్‌ల‌ను ఆయ‌న చిత్రీక‌రించారు. తాజాగా ఆయ‌న `గెరాల్డ్‌-ద జిరాఫీ` అనే ఫీచ‌ర్ ఫిల్మ్‌ను తీస్తున్నారు. త‌న చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా.. ద‌క్షిణాఫ్రికాలో కేప్‌టౌన్ స‌మీపంలోని జాతీయ పార్క్‌న‌కు త‌న క్రూతో క‌లిసి వెళ్లాడు.

చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో సుమారు 16 అడుగుల‌కు పైగా ఎత్తు ఉన్న జిరాఫీ ఒక‌టి క్రూపై దాడి చేసింది. ఇలా దాడి చేసిన స‌మ‌యంలో కార్లోస్‌.. దాని బారిన ప‌డ్డాడు. నోటితో అత‌ణ్ని ఎత్తి గాల్లోకి విసిరేసిందా జిరాఫీ.

సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి కింద‌ప‌డే స‌రికి కార్లోస్ త‌ల ప‌గ‌లింది. దీనితో అత‌ను అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. కార్లోస్ అల్లాట‌ప్పా ద‌ర్శ‌కుడు కాడు. వైల్డ్ లైఫ్‌పై ప‌లు టీవీ సీరియ‌ళ్లు, డాక్యుమెంట‌రీల‌ను తీశారు. ఫ‌ర్‌గాట్టెన్ కింగ్‌డ‌మ్‌, లెసెతో వంటి సినిమాల‌కు కూడా ఆయ‌న ప‌నిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here