ఎమిరేట్స్‌లోనూ దుమ్మ రేపుతోన్న బాఘీ

అబుదాబి: బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి పారేస్తోన్న బాఘీ 2 మూవీ యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లోనూ ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. ఈ సినిమా విడుద‌లైన‌ప్ప‌టి నుంచీ హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో న‌డుస్తోంది. వారాంత‌పు రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా దొర‌క‌ట్లేద‌నేది ట్రేడ్ టాక్‌. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లో టాప్ టెన్ మూవీలో బాఘీ 2 ఫోర్త్‌ ప్లేస్‌లో కొన‌సాగుతోంది.

హాలీవుడ్ మూవీ `ఎ క్వైట్ ప్లేస్‌` టాప్ ప్లేస్‌లో ఉండ‌గా.. నాలుగో స్థానాన్ని బాఘీ 2 ఆక్ర‌మించింది. మ‌న‌దేశంలో బాఘీ 2 ఇప్ప‌టికే 100 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన సినిమాల జాబితాలో చేరిపోయింది. రేపో, మాపో 150 కోట్ల మార్క్‌ను అందుకోవ‌చ్చ‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు.

జాకీష్రాఫ్ త‌న‌యుడిగా బాలీవుడ్‌లో అడుగు పెట్టిన టైగ‌ర్ ష్రాఫ్‌కు ఇది అయిదో మూవీ. అత్యంత వేగంగా 100 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన సినిమాల జాబితాలో చేరిందీ సినిమా.

మ‌ల‌యాళ సినిమా `సుదాని ఫ్ర‌మ్ నైజీరియా` రెండో స్థానాన్ని ఆక్ర‌మించింది. ఎమిరేట్స్‌లో పెద్ద సంఖ్య‌లో ఉన్న మ‌ల‌యాళీలు ఈ సినిమాను సూప‌ర్ హిట్ చేశారు. మూడో స్థానంలో పీట‌ర్ ర్యాబిట్‌, అయిదో స్థానంలో రెడీ ప్లేయ‌ర్ వ‌న్ మూవీలు కొన‌సాగుతున్నాయి. బాలీవుడ్ మూవీ బ్లాక్ మెయిల్ ఆరో స్థానంలో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here