మ‌ర్మాంగానికి తాడును క‌ట్టి..ట్రాక్ట‌ర్‌ను లాగాడు..!

భారీ ట్రక్కులు, బ‌స్సుల‌ను తల వెంట్రుకలతోనో, ప‌ళ్ల‌తోనో లాగ‌డం ఇప్ప‌టిదాకా మ‌నం చూశాం. ఈ సాధువు మాత్రం చాలా డిఫ‌రెంట్‌. తన మర్మాంగానికి తాడును కట్టి ట్రాక్టర్‌ను లాగి అవ‌త‌ల ప‌డేశాడు.

 

ఉత్త‌ర్‌ప్రదేశ్ అలహాబాద్‌లో మాఘ మేళా ఉత్స‌వాల సంద‌ర్భంగా ఆ సాధువు త‌న సాధ‌నాశ‌క్తిని ప్ర‌ద‌ర్శించారు. ఈ సాధ‌న ద్వారా తన ఆధ్యాత్మిక శక్తిని నిరూపించుకున్నాన‌ని సాధువు ప్రకటించాడు.

అల‌హాబాద్‌, ప్ర‌యాగ వద్ద 45 రోజుల పాటు మాఘ‌మేళా ఉత్స‌వాలు కొన‌సాగుతాయి. ఈ సంద‌ర్భంగా హిమాల‌యాల నుంచి పెద్ద ఎత్తున సాధువులు ఈ ఉత్స‌వాల‌కు హాజ‌ర‌వుతున్నారు.

త‌మ సాధనాశ‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కుంభ్‌మేళా వంటి కార్య‌క్ర‌మాల్లో సాధువులు, అఘోరీలు చేసే ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను ఇప్ప‌టికే చాలా చూసి ఉంటాం. ఇది కూడా అలాంటిదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here