సంవత్సరం క్రితం ఇలా పుట్టింది.. ఇప్పుడు ఎలా ఉందంటే..!

కొన్ని కొన్ని సార్లు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తోంది అలాంటి అద్భుతాన్నే..! బయట నుండి మెదడు కనిపించేలా పుట్టింది ఆ పాప.. నెలలు నిండడం కాదు కదా కనీసం సరిగ్గా శరీరభాగాలు ఎదగను కూడా లేదు.

22ఏళ్ల చెర్రీ ప్రైస్ అనే యువతి ఆసుపత్రికి వెళ్ళింది. అప్పటికి ఆమె గర్భవతి అయి 23వారాల ఆరు రోజులు మాత్రమే అయింది. అయితే ఆమెకు అనుకోకుండా నొప్పులు వచ్చి శిశువు బయటకు వచ్చింది. ఆ పుట్టిన శిశువు చాలా బలహీనంగా ఉండడమే కాకుండా.. శరీరం ఎదగలేదు కూడానూ..! ఆ శిశువును చూసి అందరూ బ్రతకడం కష్టమే అని అన్నారు. కానీ వైద్యులు బ్రతికించడానికి ఎంతగానో ప్రయత్నించారు. వెంటనే ఆ శిశువును ఇంక్యుబేటర్ లో పెట్టారు.

మిడిల్స్ బ్రో లోని జేమ్స్ కుక్ యూనివర్సిటీ ఆసుపత్రిలో వైద్యులు ఆ శిశువును కంటికి రెప్పలా చూసుకున్నారు. దాదాపు కొన్ని నెలల పాటూ ఆ చిన్నారి పూర్తిగా కోలుకునేలా చూశారు. ఒక్కో శరీరభాగం పూర్తిగా డెవలప్ అవ్వడం మొదలైంది. చివరికి ఆ చిన్నారి తన కళ్ళను తెరవలేకపోయింది. ఆమె కళ్ళలో రెటీనా పూర్తిగా దెబ్బతినడమే అందుకు కారణమట. వెంటనే ప్రైవేటు విమానంలో సౌత్ హాంప్టన్ లో ఉన్న ప్రిన్స్ అన్నే ఆసుపత్రికి.. ఆ తర్వాత పోర్ట్స్ మౌత్ క్వీన్ అలెగ్జాండ్రియా ఆసుపత్రికి తీసుకొని వెళ్ళడంతో కంటి చూపును దక్కించుకుంది ఆ చిన్నారి. ఫిబ్రవరి నుండి జూన్ దాకా ఆ చిన్నారి ఆసుపత్రుల లోనే ఉంది. ఇక ఆ పాపకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు ధృవీకరించడంతో జూన్ 19న ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఇటీవలే ఆ చిన్నారి పుట్టినరోజును నిర్వహించారు. హేలీ అని ఆ పాపకు పేరు పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here