విద్యుద్ఘాతానికి గురై మ‌ర‌ణించిన కొండ‌ముచ్చు..క‌ళేబ‌రాన్ని వ‌ద‌ల‌కుండా అంటి పెట్టుకున్న బిడ్డ‌!

క‌న్న‌త‌ల్లి ప్రేమ‌ను మించింది ఈ లోకంలో మ‌రేదీ లేదంటారు. అందుకే- త‌న క‌న్న‌త‌ల్లి ఇక లేద‌నే విష‌యాన్ని జీర్ణించుకోలేక పోయింది. త‌ల్లి క‌ళేబ‌రాన్ని అట్టే అట్టిపెట్టుకుని కొన్ని గంట‌ల పాటు కూర్చుంది. అంతిమ‌యాత్ర‌లోనూ వ‌ద‌లిపెట్ట‌లేదు.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని గ‌ద‌గ్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ల‌క్ష్మేశ్వ‌ర ప‌ట్ట‌ణం శిగ్లి క్రాస్ వ‌ద్ద విద్యుద్ఘాతానికి గురై ఓ కొండ‌ముచ్చు మ‌ర‌ణించింది. బిడ్డ‌తో స‌హా వెళ్తుండ‌గా, క‌రెంటు తీగ‌లు త‌గిలి అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించింది. దీన్ని గ‌మ‌నించిన స్థానికులు కొండముచ్చు క‌ళేబ‌రానికి అంత్య‌క్రియ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు.

క‌ళేబ‌రానికి అంత్య‌క్రియ‌ల ఏర్పాట్లు చేశారు. బిడ్డ మాత్రం త‌ల్లి క‌ళేబ‌రాన్ని వ‌ద‌ల్లేదు. అలాగే అట్టి పెట్టుకుని కొన్ని గంట‌ల పాటు కూర్చుండిపోయింది. దీన్ని చూసిన స్థానికులు క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here