జ‌లుబు చేసిన చిన్నారికి నెబ్యులైజర్‌ పెట్టి మ‌రిచిపోయిన న‌ర్సమ్మ‌!

ధార్వాడ‌: న‌ర్స్ నిర్ల‌క్ష్యం ఓ ప‌ది నెల‌ల చిన్నారి పాలిట శాపంలా మారింది. జ‌లుబుతో బాధ‌ప‌డుతున్న చిన్నారికి నోటికి నెబ్యులైజింగ్ పెట్టి, మ‌రిచే పోయింది. దీని ఫ‌లితం.. ఆ పాప నోటి చుట్టూ చ‌ర్మం క‌మిలిపోయింది. కాలిపోయింది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని ధార్వాడలో చోటు చేసుకుంది. ఆ చిన్నారి పేరు లావ‌ణ్య‌. ధ‌ర్వాడ గొల్ల‌ర కాల‌నీకి చెందిన నాగేష్‌, అంజలి కుమార్తె.

రెండురోజులుగా జ‌లుబుతో బాధ‌ప‌డుతుండ‌ట‌తో పాప త‌ల్లి అంజ‌లి, అత్త ఆ చిన్నారిని ధార్వాడ‌లోని త‌వ‌ర‌గెరి న‌ర్సింగ్‌హోమ్‌కు తీసుకెళ్లారు. పాప‌ను ప‌రీక్షించిన త‌రువాత డాక్ట‌ర్ నెబ్యులైజింగ్ చేయాల‌ని న‌ర్స్‌కు సూచించారు. ఆ న‌ర్సమ్మేమో.. పాప నోటికి నెబ్యులైజ‌ర్ పెట్టి మాట‌ల్లో ప‌డింది. అటు ఇటూ తిర‌గ‌డానికే స‌రిపోయింది.

పాప‌కు నెబ్యులైజ‌ర్ పెట్టాన‌నే విష‌యాన్ని మ‌రిచిపోయింది. ఆ స‌మ‌యంలో త‌ల్లి కూడా ప‌క్క‌న లేదు. చాలాసేపు అలాగే ఉంచ‌డం వ‌ల్ నెబ్యులైజ‌ర్ నుంచి వేడి గాలి సోకి, చిన్నారి నోటి చుట్టు ఉన్న చ‌ర్మం క‌మిలిపోయింది.

ప్ర‌స్తుతం ఆ పాప పాల‌ను కూడా తాగ‌లేక‌పోతోంది. పైప్ ద్వారా పాలు, ఇత‌ర ద్ర‌వ ప‌దార్థాల‌ను అందిస్తున్నారు. న‌ర్సు నిర్ల‌క్ష్యం వ‌ల్లే త‌మ చిన్నారికి గాయ‌ప‌డిదంటూ ఆరోపించారు. అదే ఆసుప‌త్రిలో పాప‌కు చికిత్స అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here