బాహుబ‌లికి మ‌హామ‌స్త‌కాభిషేకం!

బెంగ‌ళూరు: పుష్క‌ర కాలానికి ఒక్క‌సారి అత్యంత వైభ‌వంగా, క‌న్నుల పండువ‌గా జ‌రిగే బాహుబ‌లి మ‌హామ‌స్త‌కాభిషేకం వేడుక‌లు శ‌నివారం ఆరంభ‌మ‌య్యాయి.

క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ జిల్లా శ్రావ‌ణ బెల‌గోళ గ్రామంలో వింధ్య‌గిరి ప‌ర్వ‌తంపై 62 ఎత్తు ఉన్న ఏక‌శిలా విగ్ర‌హ రూపంలో కొలువైన గోమ‌ఠేశ్వ‌రునికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ఈ ఉత్స‌వాల‌ను ప్రారంభించారు. దీనికోసం ఆయ‌న 825 మెట్లు ఎక్కి.. వింధ్య‌గిరి ప‌ర్వ‌తానికి కాలిన‌డ‌క‌న చేరుకున్నారు.

దేశం న‌లుమూల‌ల నుంచీ జైనమునులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. 108 క‌ళ‌శాల‌తో అష్ట ద్ర‌వ్యాల‌తో బాహుబ‌లి విగ్ర‌హానికి అభిషేకించారు. జ‌లం, క్షీరం, చెర‌కు ర‌సం, గంధం, కేస‌రి నీటితో అభిషేకాలు క‌న్నుల పండువ‌గా కొన‌సాగాయి.

ఈ నెల 27వ తేదీ వ‌ర‌కూ ఈ ఉత్స‌వాలు కొన‌సాగుతాయి. ఈ ఉత్స‌వాల్లో పాల్గొన‌డానికి దేశ‌, విదేశాల నుంచి పెద్ద ఎత్తున జైనులు హాజ‌ర‌య్యారు. వారి రాక‌తో శ్రావ‌ణ బెల‌గోళ గ్రామం క్రిక్కిరిసిపోయింది.

ఉత్స‌వాలు ముగిసేనాటికి క‌నీసం 25 ల‌క్ష‌ల మంది బాహుబ‌లిని సంద‌ర్శిస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. 12 ఏళ్ల‌కోసారి జ‌రిగే కార్య‌క్ర‌మం కావ‌డంతో విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భ‌క్తులు హాజ‌ర‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here