బండారు దత్తాత్రేయ ఒక్కగానొక్క కొడుకు గుండెపోటుతో మృతి.. అతడి వయసెంతో తెలుసా..?

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఒక్కగానొక్క కొడుకు వైష్ణవ్ గుండెపోటుతో మరణించాడు. వైష్ణవ్ వయసు కేవలం 21 సంవత్సరాలే..! అంత చిన్న వయసులో కూడా గుండెపోటు వస్తుందా అని ప్రతి ఒక్కరూ షాక్ అవుతూ ఉన్నారు. ఎదిగిన కొడుకును కోల్పోయిన బండారు దత్తాత్రేయను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.

వైష్ణవ్ మంగళవారం రాత్రి 10:45 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని ముషీరాబాద్‌లోని గురునానక్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:30 గంటలకు మృతి చెందాడు. వైష్ణవ్‌ను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు తెలిపారు. వైష్ణవ్ ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here