సీఐ పిలిచాడ‌ని భ‌యంభ‌యంగా పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి రౌడీ షీట‌ర్లు! అక్క‌డి త‌తంగం చూసి..ఉలిక్కిప‌డ్డారు

బెంగ‌ళూరు శివార్ల‌లోని అనేక‌ల్ పోలీస్‌స్టేష‌న్‌. అక్క‌డి సీఐ రాజేశ్ అంటే రౌడీషీట‌ర్ల‌కు హ‌డ‌ల్‌. చెంప‌ల‌దాకా మీసాలు పెంచుకుని చూడ్డానికి అచ్చంగా `సింగం` సినిమాలో సూర్య‌లా ఉంటారాయ‌న‌.

చాలా స్ట్రిక్ట్ ఆఫీస‌ర్ అనే పేరుంది. కొత్త సంవ‌త్స‌రాదిని పుర‌స్క‌రించుకుని పొద్దున్నే ఆయ‌న నుంచి పిలుపు రావ‌డంతో ఒక్క‌సారిగా ఆందోళ‌న‌కు గుర‌య్యారు రౌడీషీట‌ర్లు. భ‌యం, భ‌యంగా పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లారు.

అక్క‌డికి వెళ్లిన త‌రువాత పోలీసులు త‌మ ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన విధానం చూసి ఉలిక్కిప‌డ్డారు. ఇది క‌లా? నిజ‌మా? అంటూ ఓసారి గిల్లుకుని చూసుకున్నారు.

ఎందుకంటే.. పోలీస్‌స్టేష‌న్‌లో రౌడీషీట‌ర్ల‌కు రాచ‌మ‌ర్యాద‌లు ల‌భించాయి. ప్ర‌తి ఒక్క రౌడీ షీట‌ర్‌ను పేరు పేరునా పిలిచి, మ‌రీ స్వీట్ బాక్స్‌ను వారి చేతిలో పెట్టారు సీఐ రాజేశ్‌.

ఆ స్వీట్ బాక్స్‌తో పాటు ఓ క‌న్న‌డ పుస్త‌కాన్ని ఇచ్చారు. వ్య‌క్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్త‌కం అది. నేర మ‌న‌స్త‌త్వం ఉన్న వారి కోసం ప్ర‌త్యేకంగా రాశార‌ట‌. దాన్ని రోజూ చ‌ద‌వాలని సూచించారు సీఐ.

పుట్టుక‌తోనే ఎవ‌రూ నేర‌స్తులు కార‌ని, ప‌రిస్థితుల వ‌ల్లే అలా త‌యార‌వుతార‌ని, వ్య‌క్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవ‌డం ద్వారా త‌మ మ‌న‌స్త‌త్వాన్ని మార్చుకోవచ్చనీ చెప్పారు. రౌడీ షీట‌ర్ల‌తో క‌లిసి గ్రూప్ ఫొటో దిగడం ఓ షాకింగ్ ట్విస్ట్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here