న‌గ్న ఫొటోలున్నాయ్‌: రూ.2 కోట్లు ఇవ్వ‌క‌పోతే పోస్ట‌ర్లు వేస్తాం: జూనియ‌ర్ ఆర్టిస్టుల బెదిరింపు

హైద‌రాబాద్: న‌గ్న ఫొటోలు ఉన్నాయ‌ని, రెండు కోట్ల రూపాయ‌ల‌ను వెంట‌నే ఇవ్వ‌క‌పోతే.. పోస్ట‌ర్లు వేసి గోడ‌ల‌పై అతికిస్తామంటూ ముగ్గురు జూనియ‌ర్ ఆర్టిస్టులు ఓ రియ‌ల్ట‌ర్ క‌మ్ కాంట్రాక్ట‌ర్‌ను బెదిరించిన ఘ‌ట‌న ఇది. ఆ ముగ్గురు జూనియ‌ర్ ఆర్టిస్టులు అమ్మాయిలే కావ‌డం పోలీసుల‌ను ఆశ్చ‌ర్య ప‌రిచింది.

మాదాపూర్‌లో నివాసం ఉంటోన్న ద్వార‌క‌నాథ్ రెడ్డి కాంట్రాక్ట‌ర్‌. ఆయ‌న‌కు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. ఆస్తిప‌రుడు. దానితో పాటు ఆయ‌న‌కు కొన్ని చెడు అల‌వాట్లు కూడా ఉన్నాయ‌ట‌.

 

ఆ ముగ్గురు జూనియ‌ర్ ఆర్టిస్టులతో ద్వార‌క‌నాథ్ రెడ్డికి శారీర‌క సంబంధం ఉంద‌ట‌. ఆ ఫొటోల‌ను జూనియ‌ర్ ఆర్టిస్టులు సేక‌రించారు. వాటి ఆధారంగా బ్లాక్ మెయిల్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

ఈ విష‌యం తెలిసిన వెంట‌నే ద్వార‌కానాథ్ రెడ్డి భార్య బంజారాహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. త‌న భ‌ర్త‌ను లోబర‌చుకుని, బ్లాక్ మెయిల్ చేస్తున్నార‌ని, రెండు కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేస్తున్నార‌ని ఆమె ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే నాలుగు కోట్ల రూపాయ‌ల‌ను తీసుకుని కూడా ఇంకా బెదిరిస్తున్నార‌ని అన్నారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు జూనియ‌ర్ ఆర్టిస్టుల కోసం దర్యాప్తు చేపట్టారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here