బార్ డ్యాన్సర్ మీద రెండు కోట్లు ఖర్చు పెట్టాడు.. వేరే వ్యక్తితో లవ్ లో ఉందని తెలిసి ఎంత కిరాతకంగా అంటే..!

అతడు బార్ డ్యాన్సర్ తో ప్రేమలో ఉన్నాడు. అది సహజీవనం దాకా వెళ్ళింది. కానీ ఆమె వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అన్న అనుమానంతో ఆమెను అతి కిరాతకంగా చంపేశాడు. గొడ్డలి తీసుకొని నరికి.. మొండెం నుండి తలను వేరు చేశాడు.

పంజాబ్ లోని భటిండా పట్టణానికి చెందిన జ్యోతి అలియాస్ నిషా జ్యోతి ముంబయిలో మోడలింగ్ తో పాటు బార్ డ్యాన్సర్ గా పని చేసేది. సూరత్ శివారులోని టింబా గ్రామానికి చెందిన 30 ఏళ్ల ప్రీతేష్ పటేల్ తరచూ ముంబయికి వచ్చేవాడు. జ్యోతి ఉన్న బార్ కు ఎక్కువగా వెళ్లేవాడు. జ్యోతితో పరిచయం పెంచుకొని రిలేషన్ గా మారింది. ఇద్దరూ సహజీవనం చేసే వరకూ వెళ్లింది. డిసెంబరు 27న జ్యోతి బర్త్ డే కావటంతో ప్రీతేష్ పటేల్ ఫాం హౌస్ కు వచ్చింది.

అక్కడే వారు బర్త్ డే పార్టీతో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కానీ వారి మధ్య వాదులాట మొదలైంది. జ్యోతి వేరే వ్యక్తితో ప్రేమలో ఉందన్న అనుమానంతో గొడవకు దిగాడు. ఆ తర్వాత ఆమెను అరటికాయల తోటలోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ గొడ్డలితో కిరాతకంగా నరికి చంపేశాడు. ఆమె తలను మొండెం నుండి వేరు చేశాడు. జ్యోతి స్నేహితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ హత్య బయటకు వచ్చింది. పరారీలో ఉన్న ప్రీతేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

తాను జ్యోతి కోసం దాదాపు రెండు కోట్లకు పైగా ఖర్చు చేశానని.. కారు కూడా తీసిచ్చానని ప్రీతేష్ తెలిపాడు. ప్రీతేష్ కు గతంలోనే పెళ్ళి అయిపోయిందని.. కానీ జ్యోతి మీద మోజుతో ఇలా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here