అతి చెత్త రికార్డును నమోదు చేసిన బాసిల్ థంపి.. 4 ఓవర్లలో 70 పరుగులు..!

ఐపీఎల్ లో అతిచెత్త రికార్డును నమోదు చేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ బాసిల్ థంపి.. అతడు వేసిన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు.

 

సన్ రైజర్స్ బౌలర్ గా ఇషాంత్ శర్మ ఉన్నప్పుడు 2013 లో నాలుగు ఓవర్లలో ఏకంగా 66 పరుగులు సమర్పించాడు. ఇప్పుడు 70 పరుగులు సమర్పించుకొని బాసిల్ థంపి ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్ కోసం భువనేశ్వర్ కుమార్ రెస్ట్ తీసుకోగా.. బాసిల్ థంపిని అతడి స్థానంలో జట్టు లోకి తీసుకున్నారు. అయితే ఏ మాత్రం ప్రభావం చూపకపోగా.. 70 పరుగులు సమర్పించేసుకున్నాడు.

ఓపెనర్లు పార్థీవ్ పటేల్(1)ని తొలి ఓవర్‌లోనే ఔట్ చేసి హైదరాబాద్‌కి సందీప్ శర్మ శుభారంభమివ్వగా.. తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ (12)కి రషీద్ ఖాన్ బోల్తా కొట్టించడంతో బెంగళూరు 38/2తో ఇబ్బందుల్లో పడింది. ఈ క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్, మొయిన్‌ అలీతో కలిసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారిన ఈ ఇద్దర్నీ రెండు బంతుల వ్యవధిలో రషీద్ ఖాన్ ఔట్ చేసినా.. ఆఖర్లో గ్రాండ్ హోమ్, సర్ఫరాజ్ ఖాన్ (22 నాటౌట్: 8 బంతుల్లో 3×4, 1×6) అద్భుతంగా ఆడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here