శ్రీలంకలో 10 రోజుల పాటు ఎమర్జెన్సీ.. మరి మన క్రికెటర్ల పరిస్థితి..!

శ్రీలంకలో బౌద్ధులకు.. ముస్లింలకు జరిగిన గొడవల కారణంగా 10 రోజుల పాటు ఎమర్జెన్సీ విధించారు. అక్కడికి ట్రై సిరీస్ లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్లు చేరుకున్నాయి. ఈ సమయంలో మన క్రికెటర్లకు ఏమైనా అవుతుందా అన్న భయం కూడా భారత్ లోని అధికారులు వ్యక్తం చేశారు. అయితే భారత క్రికెటర్లకు ఎటువంటి ప్రమాదం లేదని.. సెక్యూరిటీని మరింత పటిష్టం చేశామని శ్రీలంక అధికారులు స్పష్టం చేశారు. క్యాండీలో మాత్రమే కర్ఫ్యూ విధించారని.. మిగతా ప్రాంతాల్లో ఎలాంటి గొడవలు లేవని మీడియా కూడా స్పష్టం చేసింది.

కొలంబోలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. మిగతా ప్రాంతాలతో పోలిస్తే చాలా ప్రశాంతంగా ఉందని చెప్పారు. ట్రై-సిరీస్ కు ఎటువంటి అడ్డంకులూ లేవని శ్రీలంక స్పోర్ట్స్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఈరోజు రాత్రి 7 గంటలకు భారత్ తో శ్రీలంక జట్టు తలపడనుంది. భారతజట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు.

ఈ సిరీస్ కు విరాట్ కోహ్లీ, ధోని, హార్దిక్ పాండ్యా లాంటి స్టార్లు దూరమయ్యారు. ఈ సిరీస్ లో పాల్గొనబోతున్న మూడో జట్టు బంగ్లాదేశ్..! మొత్తం అన్ని మ్యాచ్ లు కొలంబో లోని ప్రేమదాస స్టేడియంలో నిర్వహించనున్నారు. ఒక్కో జట్టు ప్రత్యర్థి జట్టుతో రెండేసి మ్యాచ్ లు ఆడుతాయి. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ లో తలపడనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here