అంపైర్లకు జీతాలు పెంచేసిన బీసీసీఐ.. వారి జీతం ఎంతో తెలుసా..?

భారత క్రికెట్ బోర్డు.. ప్రపంచం లోనే ధనిక క్రికెట్ బోర్డు ఆ విషయం అందరికీ తెలిసిందే..! ఎప్పుడూ క్రికెటర్ల జీతాలే కాదు.. ఈ సారి అంపైర్ల జీతాలను పెంచింది బీసీసీఐ. గత కొన్నేళ్ళుగా భారత క్రికెట్ బోర్డుకు అధికంగా డబ్బులు వస్తున్నా అంపైర్ల జీతాలపై మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ సారి దృష్టి సారించి వారికి కూడా మంచి జీతాలను అందించేందుకు సిద్ధమైంది.

సీనియర్ మేల్ మ్యాచ్ లకు అంపైర్స్ గా వ్యవహరిస్తున్న దాదాపు 20 మందికి జీతం పెంచుతున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఏకంగా 100 శాతం జీతాన్ని పెంచేసింది. ఒక్క రోజు అంపైర్ గా వ్యవహరించినందుకు గానూ ఏకంగా 40000 రూపాయలు వారికి ఇవ్వనున్నారు. గతంలో 20000 రూపాయలు మాత్రమే బీసీసీఐ వారికి ఇచ్చేది.. ఇప్పుడు ఏకంగా అంతకు రెట్టింపు అందిస్తున్నారు. ఇక టీ 20 మ్యాచ్ లకు అయితే 20,000 రూపాయలు ఒక్క మ్యాచ్ కు ఇవ్వనున్నారు. మన పక్కనే ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో పోల్చుకుంటే మనం చాలా ఎక్కువగా ఇస్తున్నట్లే..! ఎందుకంటే వారు ఇస్తోంది 6000 రూపాయలు మాత్రమే.. ఏది ఏమైనా భారత్ లో అంపైర్లకు కూడా మంచి రోజులే వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here