దగ్గు మందు యూసుఫ్ పఠాన్ కు ఎంత చెడ్డ పేరు తెచ్చిపెట్టిందో..!

యూసుఫ్ పఠాన్.. భారత్ టీట్వంటీ స్పెషలిస్ట్ గా కొనసాగాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 ప్రపంచకప్ జట్లలో యూసుఫ్ కూడా ఒకడు. అయితే యూసుఫ్ పఠాన్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడి డోప్ టెస్టులో దొరికిపోయినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడ్ని అయిదు నెలల పాటూ సస్పెండ్‌ చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది.

దగ్గుతో బాధపడుతున్న యూసుఫ్ పఠాన్ బ్రోజీట్ (Brozeet) అనే మందును వేసుకున్నాడు. అందులో టెర్బ్యుటలైన్ (Terbutaline) అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉందంట. ఆ మందులు వేసుకునే ముందు బీసీసీఐతో సంప్రదించాల్సి ఉంటుంది. కానీ యూసుఫ్ పఠాన్ సంప్రదించలేదు. 2017, మార్చి 16న దేశవాళీ టీ20 సిరీస్ ఆడుతున్న సమయంలో పఠాన్ నుంచి నమూనాలను సేకరించగా.. అక్టోబరు 27న పరీక్షలకి సంబంధించి పూర్తి నివేదిక వచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. అతను వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (వాడా) నిషేధించిన జాబితాలోని పదార్థాన్ని తీసుకున్నట్లు నిర్ధరణ కావడంతోనే గత ఏడాది చివర్లో ఆరంభమైన రంజీ ట్రోఫీ ఆడకుండా అడ్డుకున్నట్లు బోర్డు తాజాగా ఓ ప్రకటనలో వివరించింది.

బరోడాకు ప్రాతినిధ్యం వహించే యూసుఫ్.. గత కొంతకాలంగా మ్యాచ్ లు ఆడడం లేదు. చివరిసారిగా యూసుఫ్ 2017 అక్టోబర్ లో ఆంధ్రప్రదేశ్ తో బరోడా మ్యాచ్ లో పాల్గొన్నాడు. ఆ మ్యాచ్ లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన ఈ బరోడా ఆల్ రౌండర్.. వికెట్ కూడా తీయలేకపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here