బీరు ధరలు పెంచేస్తున్నారు..!

తెలంగాణ మద్యం ప్రియులకు మరో బ్యాడ్ న్యూస్.. ఇటీవలే మద్యం ధరలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం బీరు ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. బీర్లపై ప్రస్తుతమున్న రేటును 12 శాతం మేరకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసేస్తోంది. ప్రస్తుతం ఈ ఫైలు సీఎం ఫైనల్ పరిశీలనలో ఉంది.

బీర్ల ధరల పెంపుతో తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు ప్రతి నెలా రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని, ప్రతి సంవత్సరం రూ.300 కోట్ల ఆదాయం వస్తుందని అంటోంది. నాలుగేళ్ల నుంచి బీర్ల ధరలు పెంచలేదని, కనీసం ఈసారైనా ధర పెంచాలని బ్రూవరీ కంపెనీలు కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి.

ఒక్కో బీరుపై కనీసం రూ.6 చొప్పున బేసిక్‌ ధరపై 20 శాతం అదనంగా చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందించాయి. ఈ క్రమంలోనే ధరలపై సమీక్షించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. ప్రస్తుతమున్న ధరలు, ఉత్పత్తిపై GST ప్రభావం అంచనాలను వేసిన కమిటీ.. 12 శాతం ధరలు పెంచేందుకు సిఫారసు చేసినట్లు సమాచారం. కమిటీ నివేదిక ఆధారంగా ఎక్సైజ్‌ విభాగం లేటెస్ట్ ధరల పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. త్వరలోనే ధరల పెంపునకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here