ర్యాగింగ్ పేరుతో క‌్యాంప‌స్‌లోనే దారుణం: అవ‌మానాన్ని త‌ట్టుకోలేక విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌!

ర్యాగింగ్ పేరుతో అనాగ‌రిక చ‌ర్య‌ల‌కు దిగారు కొంద‌రు విద్యార్థులు. కాలేజీ క్యాంప‌స్‌లోనే దారుణంగా వ్య‌వ‌హ‌రించారు. తమ జూనియ‌ర్ ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. తాము చేసిన‌ట్టుగా చేయాలంటూ గ‌ర్ల్‌ఫ్రెండ్స్‌తో క‌లిసి అశ్లీలంగా డాన్స్ చేశారు.

దీన్ని ప్ర‌తిఘ‌టించినందుకు ఆ విద్యార్థినిపై దాడి చేశారు. చేయి చేసుకున్నారు. త‌న‌కు జ‌రిగిన అవ‌మానాన్ని భ‌రించ‌లేక ఆ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటు చేసుకుంది.

ఆ విద్యార్థిని పేరు మేఘ‌న‌. బెంగ‌ళూరు కుమార‌స్వామి లేఅవుట్‌లోని ద‌యానంద సాగ‌ర్ క‌ళాశాల‌లో సివిల్ ఇంజినీరింగ్ చ‌దువుతోంది.

బుధ‌వారం రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర స‌మీపంలోని చెన్న‌సంద్ర‌లో శ‌బ‌రి అపార్ట్‌మెంట్‌లోని త‌న ఫ్లాట్‌లో మేఘ‌న ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

`ప‌బ్లిక్‌టీవీ` క‌న్న‌డ న్యూస్ ఛాన‌ల్ ఈ వీడియోను ఎక్స్‌క్లూజివ్‌గా ప్ర‌సారం చేసింది. మేఘ‌న‌ను చుట్టుముట్టిన కొంద‌రు విద్యార్థినీ, విద్యార్థులు ఆమెను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న దృశ్యాల‌ను మ‌నం ఈ వీడియోలో స్ప‌ష్టంగా చూడ‌వ‌చ్చు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here