ఇంజినీరింగ్ చివ‌రి సంవ‌త్స‌రం..క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూలో సెలెక్ట్‌! అంతా హ్యాపీ అనుకుంటుండ‌గా!

మున్సిప‌ల్ కార్పొరేష‌న్ చెత్త లారీ ఢీ కొని ఓ యువ‌తి దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. సోమ‌వారం ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటు చేసుకుంది. మృతురాలి పేరు సాహిత్య‌.

24 సంవ‌త్స‌రాల సాహిత్య‌.. ఇంజినీరింగ్ విద్యార్థిని. చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్నారు. బెంగ‌ళూరులోని రాజాజీన‌గ‌ర్‌లో నివాసం ఉంటున్న ప్రింటింగ్ ప్రెస్ య‌జ‌మాని న‌ర‌స‌రాజు కుమార్తె ఆమె.

న‌గ‌ర శివార్ల‌లోని హేస‌ర‌ఘ‌ట్ట స‌మీపంలో ఉన్న ఇంజినీరింగ్ క‌ళాశాలలో ఇటీవ‌లే నిర్వ‌హించిన క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యారు. ఓ టాప్ ప్రైవేటు సంస్థ‌లో ప్రాజెక్ట్ వ‌ర్క్‌ను పూర్తి చేస్తున్నారు.

క‌న్నింగ్‌హ్యామ్ రోడ్‌లో స్కూటీపై వెళ్తుండ‌గా.. బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలికె చెత్త లారీ ఢీ కొట్టింది. దీనితో ఆమె అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై హైగ్రౌండ్స్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here