అదీ కూతురి శక్తి.. మా నాన్న బంగారం షాపులోనే దొంగతనం చేసే దమ్ముందా అంటూ ఆరుగురిని..!

తన తండ్రి బంగారు షాపులోకి జొరబడిన దొంగలను ఓ మహిళ అడ్డుకుంది. ఎంతో ధైర్యంతో ఆమె ఏకంగా ఆరుగురు దొంగలను అడ్డుకుంది. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో దొంగలు కాస్తా వెనక్కు తగ్గి పరుగు లంకించుకున్నారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

అశోక పిల్లర్ కు దగ్గరలో ఉన్న రఘు జ్యువెలరీ షాప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. రఘు షాపులో ఉండగా ఓ దొంగ అక్కడికి వచ్చి నెక్లెస్ చూపించమని అడిగాడు. దీంతో రఘు వెంటనే వారికి తీసి చూపించసాగాడు. ఇంతలో ఆ వ్యక్తి కత్తి తీసి బంగారాన్ని బయటపెట్టమని కోరాడు. అంతే కాకుండా అతడి ఫ్రెండ్స్ మొత్తం లోపలి జొరబడ్డారు. భయపడిపోయిన రఘు గట్టిగా అరిచాడు.. పక్కనే ఇంట్లో ఉన్న అతడి కూతురు బయటకు వచ్చింది. వచ్చింది వచ్చినట్లే లోపలికి వచ్చిన దొంగలను బయటకు తోసేసి గట్టిగా అరవడం మొదలుపెట్టింది.

చుట్టుపక్కల వాళ్ళు గూమికూడతారన్న భయంతో ఆ దొంగలు కాస్తా పారిపోయారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీసులు ఆ ఫుటేజీ ఆధారంగా ఆ దొంగలను పట్టుకొనే యోచనలో ఉన్నారు. ఆ దొంగలు చిన్నవాళ్ళని.. బహుశా మొదటిసారి దొంగతనం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన ఓ వారం క్రితమే జరిగినా ఈ శుక్రవారం బయటకు వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here