2050 కల్లా బెంగళూరులో బ్రతకడం కష్టమే.. ఎందుకంటే..!

కొద్ది రోజుల క్రితం భారత జట్టు దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్ళినప్పుడు.. కేప్ టౌన్ లో నీటి కోసం పడుతున్న కష్టాల గురించి అందరికీ తెలిసి వచ్చింది. అక్కడ నీటి కోసం జనాలు ఎంతగా అవస్థలు పడుతున్నారో.. అక్కడి దృశ్యాలు కళ్ళకు కట్టినట్లు కనిపించాయి. చాలా తక్కువ మొత్తంలో.. ప్రతి మనిషికి కొన్ని లీటర్ల చొప్పున నీటిని అందిస్తూ ఉన్నారు. అయితే అలాంటి పరిస్థితి దక్షిణ భారతదేశంలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న బెంగళూరుకు రానుందట.. 2050 కల్లా బెంగళూరులో నీటి కోసం కటకతలు మొదలవుతాయని బ్రతకడం కూడా కష్టమేనని చెబుతున్నారు.

‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ)’ చేసిన సర్వేలో బెంగళూరు కేప్ టౌన్ లా మారనుండనున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని కనీసం 200 నగరాల్లో నీటి పరిస్థితిని ఈ సంస్థ విశ్లేషించింది. ఈ వివరాలను సీఎస్ఈ తన ‘డౌన్ టు ఎర్త్’ సంచికలో ప్రచురించింది. నేడు అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా నిన్న ఈ వివరాలను సీఎస్ఈ వెల్లడించడం గమనార్హం.

ప్రపంచంలో నీటి ఎద్దడిని ఎదుర్కోనున్న టాప్ 10 నగరాల జాబితాలో బెంగళూరు తర్వాత బీజింగ్ (చైనా), మెక్సికో నగరం, సానా (యెమెన్), నైరోబీ (కెన్యా), ఇస్తాంబుల్ (టర్కీ), సావో పౌలో (బ్రెజిల్), కరాచీ (పాకిస్థాన్), బ్యూనోస్ ఎయిర్స్ (అర్జెంటీనా), కాబూల్ (ఆఫ్గనిస్తాన్) ఉన్నాయి. బెంగళూరు నగరానికి సంబంధించినంత వరకు, నగరంలో నీటి బోర్ల సంఖ్య గత 30 ఏళ్లలో 5 వేల నుంచి 0.45 మిలియన్లకు పెరిగింది. పట్టణీకరణ ప్రణాళిక సరిగా లేనందు వల్ల భూగర్భ జలాల స్థాయిల్లో పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటోందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here