ప్రేమ పేరుతో న‌య‌వంచ‌న‌: అర్ధ‌న‌గ్న వీడియో తీసి, ఏడాదిగా అత్యాచారం!

ప్రేమ పేరుతో ఓ యువ‌తిని న‌మ్మించి, వంచించాడో ప్ర‌బుద్ధుడు. పైగా అత‌ను వివాహితుడు కూడా. బాధిత యువ‌తి అర్ధ‌న‌గ్న దృశ్యాల‌ను చిత్రీక‌రించి, వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి, అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

ఏడాదిగా అత‌ను ఈ కిరాత‌కాన్ని కొన‌సాగిస్తున్నాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని నెల‌మంగ‌ల తాలూకాలో చోటు చేసుకుంది. నెల‌మంగ‌ల సమీపంలోని హ‌గ్గ‌డ‌దేవ‌న‌పుర గ్రామానికి చెందిన విజ‌య్‌కుమార్ వివాహితుడు.

స్థానికంగా ఇంట‌ర్‌నెట్ సెంట‌ర్‌ను న‌డుపుతున్నారు. అత‌ని నెట్ సెంట‌ర్‌కు త‌ర‌చూ వ‌చ్చే ఓ యువ‌తితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆమెపై క‌న్నేసిన విజ‌య్‌కుమార్ ప్రేమ పేరుతో నాట‌కం ఆడాడు. ఆ యువ‌తిని న‌మ్మించాడు. శారీర‌క సంబంధం పెట్టుకున్నాడు.

పెళ్లి చేసుకోవాలంటూ బాధితురాలు ఒత్తిడి తెస్తుండ‌టంతో.. ఆమె అర్ధ‌న‌గ్న వీడియోల‌ను ప్ర‌ద‌ర్శించాడు. వాటిని ఇంట‌ర్‌నెట్‌లో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరించ‌సాగాడు.

ఆ వీడియోల‌ను అడ్డు పెట్టుకుని ఆ యువ‌తిపై ఏడాదికాలంగా అత్యాచారం చేస్తూ వ‌చ్చాడు. చివ‌రికి ఆమె ధైర్యం చేసి, పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అత‌ని గుట్టుర‌ట్ట‌యింది.

తన‌కు రెండుసార్లు అబార్ష‌న్ కూడా చేశాడ‌ని బాధితురాలు పోలీసుల ముందు ఆవేద‌న వ్య‌క్తం చేసింది. దీనిపై బాధితురాలు, ఆమె త‌ల్లిదండ్రులు మాద‌నాయ‌క‌న హ‌ళ్లి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here