భానుప్రియ మాజీ భర్త మృతి.. విషయాన్ని గోప్యంగా ఉంచారు..!

దక్షిణాదిన పలు సినిమాల్లో హీరోయిన్ గా అద్భుత ప్రదర్శన ఇచ్చిన భానుప్రియ మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ మరణించారు. ఫోటోగ్రాఫర్ అయిన ఆదర్శ్ కౌశల్ ను భానుప్రియ 1998 జూన్ లో అమెరికాలోని కాలిఫోర్నియాలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వివాహం చేసుకున్నారు. 2003 లో వారిద్దరికీ కుమార్తె పుట్టింది. అయితే 2005 లో వీరిద్దరూ విడిపోవడంతో భానుప్రియ భారత్ కు తిరిగి వచ్చేసింది. ఓ వైపు నటిగానూ.. మరోవైపు కూచిపూడి, భరతనాట్యంలో ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నారు.

ఇంతలో ఆద‌ర్శ్ కౌశ‌ల్ అమెరికాలో గుండెపోటుతో మ‌ర‌ణించినట్లు వార్త అందింది. భాను ప్రియ తన కుమార్తెతో కలిసి అమెరికా బయల్దేరారు. భానుప్రియ తన వ్యక్తిగత విషయాలను మీడియాకు దూరంగా ఉంచుతుండటంతో ఆయన మరణించారనే విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నానాల గదిలో గుండెపోటుతో కిందపడటంతో సోదరుడు అభిమాన్ 911 అత్యవసర సేవలకు సమాచారం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here