భరత్ అనే నేను సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంత అంటే..!

ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిడివి 173/174 నిమిషాలు ఉండనుంది. అంటే మూడు గంటల సినిమాకు 7 నిమిషాల తక్కువన్నమాట.

కొరటాల శివ డైరెక్షన్ లో ప్రిన్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను ఏప్రిల్ 20న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు సినిమా బాగుందని తెలిపింది. మహేష్ బాబు సరసన కైరా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చారు. లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక అమెరికాలో ప్రీమియర్ షోల రూపంలో కూడా ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల లోనూ భరత్ అనే నేను ఫీవర్ మామూలుగా లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here