ముఖ్యమంత్రికి లంచం ఇస్తానంటే చెంప చెళ్ళుమనిపించాడు.. సినిమాలో ఉంటే విజిల్సే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన భరత్ అనే నేను సినిమా మంచి వసూళ్ళనే సాధిస్తోంది. సినిమా ఇప్పటికే మహేష్ కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే సినిమా నిడివి ఎక్కువ కావడంతో కొన్ని సన్నివేశాలను సినిమాలో పెట్టలేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఒక హోళీ ఫైట్ ను కలిపారు. ఇక కలపలేకపోయిన కొన్ని సన్నివేశాలను యుట్యూబ్ లో పెట్టారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ సోషల్ మీడియాలో పెట్టిన ఆ వీడియోలకు అద్భుతమైన స్పందన వస్తోంది.

ముఖ్యంగా ఒక రైతు పొలం దున్నుతూ ఉంటే.. తన కాన్వాయ్ ను ఆపి మహేష్ బాబు పంట ఏది వేస్తున్నావ్.. వర్షం వస్తుందా రాదా.. అన్న సీన్ ప్రస్తుతం రైతుల పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఇక ముఖ్యంగా సినిమాలో విద్యా వ్యవస్థను బాగుపరచడానికి చేసే ప్రయత్నానికి అడ్డు పడుతూ కార్పోరేట్ సంస్థల యాజమాన్యం వచ్చే సీన్ ను సినిమాలో పెట్టింటే బాగుండేదని అంటున్నారు. సార్ మీకేమన్నా కావాలంటే మేమందరం కలిసి ఇచ్చేస్తాం సార్ అన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ కొడుకు చెంప చెల్లుమనిపించే సీన్ అద్భుతంగా ఉంది. దీనిని కానీ సినిమాలో అలాగే ఉంచి ఉండి ఉంటే బాగుండేది అని అంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here